Shankaraguptam: శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసమీ జిల్లా పరిధిలోని శంకరగుప్తం (Shankaraguptam) మేజర్ డ్రైయిన్ ఆధునికీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పవన్ శ్రీకారం చుట్టారు. ఇటీవల రాజోలు (Rajolu)లో తన పర్యటన సందర్భంగా 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 35 రోజుల్లోపే ఈ సమస్యకు సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పరిష్కారం చూపినట్టు జనసేన పార్టీ పేర్కొంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.






