Ganta Srinivasa Rao: ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు .. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే : గంటా
రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మ్యూజియం, ఆధ్మాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితరాలకు ఈ భవనాలను ఇవ్వాలని వివిధ సంస్థలు ప్రతిపాదించాయి. ఏడాదిన్నరగా నిర్వహణ లేకపోవడం వల్ల భవనాలు పాడైపోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ (Vishnu Kumar Raj) చెప్పినట్టు స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రుషికొండ భవనాలపై ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందంటూ ఒక జంట సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం. నిజం లేదని తేలితే వారిపై చర్యలు ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ సిబ్బంది నొచ్చుకునేలా మాట్లాడారని ఆరోపణ చేసిన జంట, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదు అని వ్యాఖ్యానించారు.






