Palla Srinivasa Rao: చంద్రబాబు సారథ్యంలో విజనరీ పాలన : పల్లా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశాల మేరకు ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో చేపట్టాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు సంక్షేమ పథకాల అమలును వివరించాలన్నారు. ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక పండుగలా (festival) నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల జగన్ (Jagan) పాలనలో రాష్ట్రం అగమ్యగోచరంగా మారిందని, చంద్రబాబు సారథ్యంలో విజనరీ పాలన మొదలైందని చెప్పారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం దిశగా పరుగులు పెడుతోందన్నారు.






