Naga Vamsi: లెనిన్ మూవీపై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అఖిల్(akhil) మూవీతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అఖిల్ కు ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ అనేది పడలేదు. ఇక లాభం లేదని మేకోవర్ అయి, ఎన్నో ఆశలతో ఏజెంట్(Agent) మూవీ చేస్తే అది టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నాడు అఖిల్.
అందులో భాగంగానే అఖిల్ తర్వాతి సినిమా కోసం ఎంతో మంది డైరెక్టర్లు చెప్పిన కథల్ని విని, వాటిలో మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కం లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు అఖిల్.
అయితే ఇప్పుడీ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ(Naga vamsi) కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లెనిన్(lenin) మూవీ చూసి అక్కినేని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారని, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ ఫైర్ అవదని, సినిమా విషయంలో ఎక్కడా ఎలాంటి తప్పులు జరక్కుండా నాగార్జున(nagarjuna) భూతద్దాలు పెట్టి మరీ వెతుకుతున్నారని, త్వరలోనే ఈ మూవీ నుంచి ఓ సాంగ్ కూడా రానుందని, లెనిన్ ఎవరినీ డిజప్పాయింట్ చేయదని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు వంశీ.






