MSG: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ నుంచి పర్ఫెక్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ మెగా విక్టరీ మాస్ సాంగ్ లాంచ్
‘మన శంకరవర ప్రసాద్ గారు’లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు చేసిన అల్లరి, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు: మెగా విక్టరీ మాస్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి
సంక్రాంతి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ మెగా విక్టరీ మాస్లో వారి డైనమిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇది ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.
ప్రేక్షకులను అలరించే సాంగ్స్ రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన భీమ్స్ సిసిరోలియో, పండుగ పల్స్, డ్యాన్స్-ఫ్లోర్ ఎనర్జీతో నిండిన మరో అద్భుతమైన ట్రాక్‌ను అందించారు. నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని పవర్ ఫుల్ వోకల్స్ అందిస్తూ పాటలో ఎనర్జీ నింపారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం పక్కా మాస్ టచ్‌తో పాటు నాస్టాల్జియా ఫీల్‌ని మేళవించి, ఈ స్టార్ స్టడెడ్ రీయూనియన్‌కి పర్ఫెక్ట్ గా నిలిచింది.
స్టైలిష్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ పాటలో ఇద్దరు పవర్‌హౌస్ పెర్ఫార్మర్లు అదరగొట్టారు. చిరంజీవి గారి మెగాస్టార్ ఆరా, వెంకటేష్ గారి క్లాసీ చార్మ్ కలిసి ప్రతి ఫ్రేమ్ అద్భుతంగ వుంది. ఇద్దరి డాన్స్ మూవ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, సిగ్నేచర్ స్వాగ్ ఈ పాటను విజువల్–మ్యూజికల్ స్పెక్టకిల్‌గా నిలబెట్టాయి.
కోరియోగ్రాఫర్ విజయ్ పోలకి హై-వోల్టేజ్ స్టెప్పులతో పాట ఎనర్జీని మరింత పెంచారు. చిరంజీవి గారి ట్రేడ్‌మార్క్ గ్రేస్, వెంకీ గారి కూల్ స్టైల్.. ప్రతి బీట్ పండుగ ఉత్సాహాన్ని తాకేలా వుంది. ఈ ట్రాక్ ఒక విజువల్ ఫీస్ట్, మ్యూజికల్ ట్రీట్..ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్.
చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి కలయిక మొదటి నుంచే భారీ ఆసక్తిని రేపగా, ఈ పాట ఆ క్యూరియాసిటీని మరింత పెంచింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు.
మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12, 20226న సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావు పూడి మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. విజ్ఞాన్ యూనివర్సిటీ కి ఎంతోమంది గెస్ట్‌లు వస్తుంటారు, పోతుంటారు. అనిల్ రావిపూడి లోకల్( నవ్వుతూ) మిమ్మల్ని అందరిని మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా ఈవెంట్లు ఇక్కడ వచ్చాను. ఫస్ట్ టైం నా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ పాస్ అయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్లి ఈరోజు మీ ముందు డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఆ జర్నీ అంత కళ్ళ ముందు కనబడి కనిపించింది. విజ్ఞాన్ మహోత్సవం ఈవెంట్ లో నేను ఫస్ట్ టైం ఒక స్కిట్ ని డైరెక్ట్ చేశాను. నిజంగా ఈవెంట్ లేకపోతే నేను డైరెక్షన్ వైపు వెళ్లే వాడినే కాదు. కాలేజ్ అనేది ఎడ్యుకేషన్ మాత్రమే కాదు మన లక్ష్యాన్ని చూపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇది నా తొమ్మిదో సినిమా. చాలా స్పెషల్ ఫి.లిం నేను చిన్నప్పుడు నుంచి తెలుగు సినిమా స్టార్స్ ని చూస్తూ పెరిగాను. చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఈ నలుగురు సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది. వెంకటేష్ గారితో చేశాను. బాలకృష్ణ గారితో చేశాను. ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చింది. స్కూల్ డేస్ లో నేను ఆయన పాటలకి డ్యాన్స్ చేసేవాడిని. అలాంటి హీరో సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం రావడం, అలాగే నాకు ఇష్టమైన జానర్లో సినిమా చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
చిరంజీవి గారిని మీరందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఈ సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా నిర్మతలు సాహు గారికి సుస్మిత గారికి థాంక్యూ. వెంకటేష్ గారు ఈ సినిమాలో ఒక స్పెషల్ కేమియో చేశారు. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఈ ఇద్దరు స్టార్స్ ని ఒక ఫ్రేమ్‌లో చూడాలనేది మన డ్రీమ్. ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి డాన్స్ మీరు థియేటర్స్ లో చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు. ఈ సంక్రాంతి మీకు చాలా మెమరబుల్ గా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం నా కెరీర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిలిం ఈ సంక్రాంతి కూడా అలాగే అవుతుందని ఆశిస్తున్నాను. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమాని థియేటర్లోకి వెళ్లి చూడండి. అలాగే పండక్కి వస్తున్న ప్రభాస్ గారి రాజా సాబ్, మాస్ మహారాజా రవితేజ గారి ఫిలిం, నవీన్, శర్వా సినిమాలు కూడా వస్తున్నాయి. అందరి సినిమాలని చూడాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతిని ఒక సినిమా ఫెస్టివల్ గా చేయాలని కోరుకుంటున్నాను. మన శంకర వరప్రసాద్ గారు సినిమాని థియేటర్స్ లో మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. అందరూ ఈ పాట చూశారు. ఈపాటికి మీరు ఎంత డాన్స్ చేశారో దానికి రెండింతలు డాన్స్ థియేటర్లో వేస్తారు. డెఫినెట్‌గా ఈ పాట పెద్ద బ్లాక్ బాస్టర్ సాంగ్ అవుతుందని నమ్మకం, ఈ వైబ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నేను అనిల్ గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి. నిర్మాత నా డ్రీం ఫుల్ ఫిల్ చేసింది మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. జనవరి 12 ఈ సినిమా వస్తోంది. అందరం థియేటర్లో కలుద్దాం. మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారు.
కొరియోగ్రాఫర్ వవిజయ్ పోలాకి మాట్లాడుతూ.. నేను మెగా ఫ్యాన్ ని. ఇందులో డ్యాన్సులు అదిరిపోతాయి. అనిల్ రావిపూడి గారు ఇదే కాలేజ్ నుంచి వచ్చి నేషనల్ అవార్డు కొట్టారు. ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి మీద ఎంత ప్రేమ ఉందో మీరు మీసాల పిల్ల సాంగ్ లో చూశారు. మెగా విక్టరీ మాస్ సాంగ్ కూడా థియేటర్లో మామూలుగా ఉండదు. జనవరి 12న సినిమా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. చిరంజీవి గారితో పని చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఈ సంక్రాంతి అదిరిపోద్ది.






