Beauty: జనవరి 2 నుంచి జీ 5లో ‘బ్యూటీ’ స్ట్రీమింగ్
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లతో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్యమాల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మరోసారి తన విలక్షణతను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్షకులకు అందిస్తోంది. డిఫరెంట్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిలఖి పాత్రా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జీ 5లో జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
https://x.com/ZEE5Telugu/status/2005890994815000614
హృదయాన్ని హత్తుకునే క్యూట్ లవ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అపరిమితమైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మరో వైపు.. ఈ సంఘర్షణలో కథ ఎలాంటి మలుపులు తీసుకుందనే ఆసక్తికరమైన మలుపులున్న కథాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఇప్పుడు జీ 5లో జనవరి 2 నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.
అలేఖ్య (నిలఖి పాత్రా), అర్జున్ (అంకిత్ కొయ్య) ప్రేమించుకుంటారు. అలేఖ్య తండ్రి నారాయణ (వీకే నరేష్) ఓ క్యాబ్ డ్రైవర్. కూతురంటే మాటల్లో చెప్పలేని ప్రేమ. కూతురికి బర్త్ డే గిఫ్ట్‌గా టూ వీలర్ బండిని కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. అలాగే అర్జున్ కూడా ఆమెకు బండి కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. తండ్రి మాటపై నిలబడకపోవటంతో అలేఖ్య తండ్రితో గొడవపడి వెళ్లిపోతుంది. అర్జున్, నారాయణ ఆమె నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. కోపంతో తీసుకున్న నిర్ణయం అలేఖ్యను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది..నారాయణ కూతుర్ని కాపాడుకోవటానికి ఏం చేస్తాడు? చివరకు ఆమె ఎలా బయటపడిందనేదే సినిమా కథాంశం.
ZEE5 గురించి…
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.






