Bhogapuram : భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నుంచి తొలి విమానం ఎగరడానికి ముహూర్తం ఖరారైంది. మరికొద్ది నెలల్లో విమానాశ్రయం పనులు పూర్తికానున్నాయి. 2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా జనవరి (January)లో టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనున్నట్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ (GMR) తాజాగా ప్రకటించింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. జనవరి 4న తొలి టెస్టింగ్ విమానం ఎయిర్‌పోర్టులో దిగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత విమానం ఎగరనున్నట్టు తెలుస్తోంది. టెస్టింగ్ రైడ్‌లో ఇప్పటికే చిన్న చిన్న విమానాలు ప్రయోగించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వాటిని ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ ధ్రువీకరించలేదు. కానీ, ఈసారి టెస్టింగ్ ఫ్లైట్ జనవరి 4న ఉంటుందని ప్రకటించడం విశేషం. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) టెస్ట్ రైడింగ్‌ను ప్రారంభించనున్నారు.






