TGPWU: న్యూఇయర్ సందర్భంగా వారికి ఉచిత రవాణా సేవలు : టీజీపీడబ్ల్యూయూ
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు (Transportation services) అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని వెల్లడిరచింది. దీనికోసం క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ (Cyberabad), రాచకొండ పరిధుల్లో సేవలు అందిస్తామని, ఉచిత రైడ్ కోసం 8977009804 నంబర్‌కు కాల్ చేయాలని టీజీడబ్ల్యూయూ (TGPWU) సూచించింది.






