DBV Swami: ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేశాం : మంత్రి స్వామి
వైఎస్ జగన్ (YS Jagan) మాదిరిగా ప్రజలను మోసం చేయబోమని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డీఎస్‌బీవీ స్వామి (DSBV Swami) అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలుపాడులో ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా (Markapuram District)ను ఏర్పాటు చేశామన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందని తెలిపారు.
ప్రతి ఇంటికీ సంక్షేమంతో సీఎం చంద్రబాబు, దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.






