NYTTA: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం 2026 నూతన కార్యవర్గ ఎన్నిక
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థ అయిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) 2026 సంవత్సరానికి గాను తమ నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
నూతన అధ్యక్షుడిగా రవీందర్ కోడెల ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంలో రాబోయే ఏడాది పాటు సంస్థ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
ముఖ్య కార్యవర్గ సభ్యులు:
హరి చరణ్ బొబ్బిలి సెక్రటరీ – ఉపాధ్యక్షుడు
మహేష్ బాబు దోమల – సెక్రటరీ
డాక్టర్ సౌమ్య శ్రీ చిట్టారి – ట్రెజరర్
శ్రీవాణి కొలవాల – జాయింట్ సెక్రెటరీ
రామానుజ రెడ్డి వంగపాటి – జాయింట్ ట్రెజరర్
కమిటీ సభ్యులు:
సుధీర్ సువ్వ, రమేష్ ఎర్రం, భరత్ వుమ్మన్నగారి, నాగార్జున మండడి, విజయేందర్ బాస సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే కృష్ణ కె వీరబత్తిని, సతీష్ తాటికొండ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను అమెరికాలో మరింత విస్తృతంగా చాటిచెప్పడానికి, ప్రవాస తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ కొత్త టీమ్ కృషి చేస్తుందని అధ్యక్షులు రవీందర్ కోడెల పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు పలువురు ప్రవాస భారతీయులు అభినందనలు తెలియజేస్తున్నారు.






