వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ప్రధాని ఇక్కడి నుంచి బయలుదేరి బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.