Mynampally: కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం : మైనంపల్లి
సోషల్‌మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మళ్లీ అమెరికాకు (America) వెళ్లడం ఖాయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. కొంపల్లిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని, ఐదేళ్ల లోపు మిగిలిన అన్ని హామీలను అమలు చేస్తామని అన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన ఇంకా అధికారంలోనే ఉన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ సోషల్‌మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం, ఈ కారు, ఇలా అన్నింటా స్కామ్ చేసి పార్టీ ఫండ్‌ను కూడబెట్టుకున్నారని ఆరోపించారు.
-NS GOUD






