మేం సియాల్ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే : పొంగులేటి

గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుంది. మేం సియోల్ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే పేలుతుంది. అరెస్టు చేయలా, జీవితకాలం జైలులో పెట్టాల అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. మా నిర్ణయం కాదు, తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారు. వారంతా ఫలితాలు అనుభవిస్తారు అని తెలిపారు.