Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడంతో తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కోర్టు (Court) లను ఆశ్రయించి ఎన్నికలు ఆపాలని చూస్తే చేసేది ఏం లేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదని, అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. వందకు వంద శాతం స్థానాలు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఏయూడీ, హెచ్ఎండీఏ , జిహెచ్ఎంసీ (GHMC) లలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేస్తున్న వారు, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రూ. 5లకే బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) పథకం ద్వారా చాలామంది ఆకలి తీరుతోందని వివరించారు. ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ పథకం 80 చోట్ల మాత్రమే అమల్లో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో 150 డివిజన్లలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.