BJP: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం: రాంచందర్ రావు

ఆలస్యమైనా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రపతి , గవర్నర్ (Governor) ల పేరిట కాలయాపన చేసింది రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం. రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ (KCR) ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపునకు స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం కాబోతున్నాయని ఉద్ఘాటించారు. తమకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తుచేశారు. తాను స్వయంగా ఇప్పటివరకు 23 జిల్లాల్లో యాత్రలు చేశానని తెలిపారు. ఇంకో నాలుగు జిల్లాల్లో యాత్ర చేయాల్సి ఉందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను తామే గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.