White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ …ఇక నుంచి స్వర్ణభరిత భూషణం కానుంది. ఇప్పటికే ఓవల్ ఆఫీస్‌లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. కానీ అవి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు తృప్తి నివ్వడం లేదు. అసలు అమెరికా అధ్యక్షుడి భవనం ఇలా ఉండడం ఏంటని భావిస్తున్న ట్రంప్.. దీన్ని మరింత స్వర్ణభరిత భూషణంగా మార్చనున్నారు.
(White House)ను 24 క్యారెట్ల బంగారు (24 Karat Gold) తాపడాలతో అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పేర్కొన్నారు. ఇందులో భాగంగా శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లో భారీగా స్వర్ణ అలంకరణలు (Gold Embellishments) చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అందమైన భవనంగా పేరుపొందిన శ్వేతసౌధం ఇకపై అత్యుత్తమమైన భవనంగా ఇక్కడికి వచ్చిన విదేశీ నేతలను విస్తుపోయేలా చేస్తుందని తెలిపారు. కార్యాలయంలో అలంకరిస్తున్న మేలిమి అలంకరణల నాణ్యత, సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోతారన్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో బంగారు పూతతో ఉన్న డజన్ల కొద్దీ డిజైన్లు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ట్రంప్.. వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి భవనాల సౌందర్యం, స్వర్ణతాపడాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకం.. ఇవన్నీ చూసిన ట్రంప్ కు సైతం మతి పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే దుబాయ్ వెళ్లిన ట్రంప్.. సౌదీ సుల్తాన్ భవన సౌందర్యానికి ముచ్చట పడ్డారు. ఇవి చూసిన తర్వాత అమెరికా వైట్ హౌస్ కూడా .. కంటికి ఆనడం లేదన్నారు. అందుకే.. వైట్ హౌస్ ను మరింతగా అందంగా, ముస్తాబు చేయించాలని భావిస్తున్నారు ట్రంప్.
వైట్‌హౌస్‌లో స్వర్ణ తాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చును ట్రంప్ (Donald Trump)నే స్వయంగా భరించినట్లు వైట్ హౌస్ (White House) ప్రతినిధి ఇటీవల పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తంలో బంగారాన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.