థాయ్‍లాండ్ నుంచి మరో మూడు … మేఘా

మేఘా ఇంజినీరింగ్ సంస్థ థాయ్‍లాండ్ నుంచి మరో మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించి ప్రభుత్వానికి అందజేసింది. ఆర్మీ ప్రత్యేక విమానం చండీగఢ్ నుంచి నేరుగా బ్యాంకాక్‍కు వెళ్ళి మధ్యాహ్నం మూడు గంటలకు ట్యాంకర్లను బేగంపేట ఎయిర్‍పోర్టుకు తీసుకొచ్చింది. మరో ఐదుట్యాంకర్లు రెండుమూడు రోజుల్లో నగరానికి చేరుకోనున్నట్లు మేఘా వెల్లడించింది. గత వారం సైతం మూడు ట్యాంకర్లను తెప్పించి ప్రభుత్వానికి అందజేయగా, వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతున్నది. ఒక్కో ట్యాంకులో 1.40 కోట్ల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్బిలిటీ కింద ప్రభుత్వానికి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను అందించనున్నట్లు మేఘా సంస్థ ప్రకటించింది.