Revanth Reddy: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనది. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టాం. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్‌మోడల్‌గా ఉన్నాం. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలి. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నాం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ (Ailamma) , మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి (Arutla Kamaladevi) సత్తాచాటారు అని అన్నారు.