Donald Trump: క్యాపిటల్ భనవం ఎదురుగా డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహం!

అమెరికా ఫెడరల్ రిజర్వు 25 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నకు చెందిన బంగారు విగ్రహాన్ని(Golden statue) అమెరికా క్యాపిటల్ (Capital) భనవం ఎదురుగా ఏర్పాటు చేశారు. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహంలో డొనాల్డ్ ట్రంప్ తన చేతిలో బిట్‌కాయిన్ (Bitcoin) ను పట్టుకుని ఉన్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు తెలిసింది. డిజిటల్ కరెన్సీ (Digital currency) భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీకి మద్దతివ్వడంపై మాట్లాడుకునేలా చేస్తుందని తెలిపారు.