America: అమెరికాకి భారీగా తగ్గిన ఎగుమతులు

అమెరికా టారిఫ్ (Tariff) ఆంక్షల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత (Indian) ఎగుమతులు తగ్గాయి. టారిఫ్‌ల కారణంగా అమెరికా (America) లో మన వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పోటీని తట్టుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇన్సియేటివ్ ( జీటీఆర్‌ఐ) సంస్థ వెల్లడిరచింది. ఆగస్టులో అమెరికాకు ఎగుమతులు 16.3 శాతం తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరాయి. జులైలో ఈ తగ్గుదల 3.6 శాతం ఉండగా, జూన్‌లో 5.7 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఎగుమతుల పతనం మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని వెల్లడిరచారు. మే నెలలో మన ఎగుమతులు గరిష్టస్థాయికి చేరాయి. 4.8 శాతం వృద్ధి చెంది 8.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ప్రస్తుత టారిఫ్‌లు 2026 ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగితే అమెరికాతో వాణిజ్యాన్ని భారత్ దాదాపు 35 బిలియన్ డాలర్లు కోల్పోయే అవకాశం ఉందని జీటీఆర్‌ఐ (GTRI) అంచనా వేసింది.