Narendra Modi: ప్రధాని మోదీ బహుమతుల ఈ వేలం ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వివిధ సందర్భాల్లో లభించిన బహుమానాలు, మెమెంటోల ను ఈ -వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అద్భుతంగా చెక్కిన ఒక భవానీ మాత విగ్రహం (Bhavani statue) , అయోద్య (Ayodhya) రామాలయ నమూనాతో పాటు మొత్తం 1300 వస్తువుల్ని ఆన్‌లైన్ (Online) పద్ధతిలో వేలం వేస్తారు. ప్రధానికి లభించిన బహుమతుల్ని ఇలా వేలం వేయడం ఇది ఏడోసారి. ఈ ప్రక్రియ వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వస్తువులన్నీ ఢిల్లీ (Delhi) లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ( ఎన్‌జీఎంఏ)లో ప్రదర్శిస్తున్నారు.