Maxivision: వైడ్‌ఫీల్డ్ రెటీనా ఇమేజింగ్‌ను పరిచయం చేసిన మ్యాక్సివిజన్
హైదరాబాద్, 15 డిసెంబర్ 2025: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ సోమాజిగూడలోని తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ది వైడ్‌ఫీల్డ్ ఫండస్ కెమెరా గా ప్రాచుర్యం పొందిన అధునాతన వైడ్‌ఫీల్డ్ ఫండస్ ఇమేజింగ్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. తద్వారా రెటీనా డయాగ్నస్టిక్స్‌లో అత్యాధునిక సాంకేతికత మన ముందుకు వచ్చింది. ఇది సాధారణ ఫండస్ కెమెరాల కంటే చాలా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఈ సాంకేతిక రెటీనాకి చెందిన విస్తృత వీక్షణను అందిస్తుంది. సంప్రదాయ ఇమేజింగ్ వల్ల సాధారణంగా వైద్యులు తరచుగా కనుగొనలేని ప్రారంభ దశ గాయాలు, క్షీణతలు, నాళ సంబంధిత మార్పులను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, రెటీనల్ టియర్స్ , యువెటిస్, వాస్కులర్ అక్లూజన్లతో సహా రెటీనా , దైహిక ఆరోగ్య-సంబంధిత కంటి వ్యాధుల భారాన్ని భారత్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రారంభం జరిగింది. ఈ తరహా అనారోగ్య పరిస్థితులలో సకాలంలో జోక్యం కోసం వేగవంతమైన, విస్తృత స్థాయి , మరింత ఖచ్చితమైన ఇమేజింగ్ అవసరం. రెటీనా విభాగంలో 70–75% మంది రోగులు మధుమేహులు. వీరికి డయాబెటిక్ రెటినోపతి కోసం క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం కావడంతో ఈ ఆధునీకరణ చాలా ముఖ్యమైనది, అయితే అధిక మయోపిక్ రోగులలో 20–25% మందికి వివరణాత్మక పెరిపిరాల్ మూల్యాంకనం, తరచుగా పర్యవేక్షణ అవసరం.
ఆవిష్కరణల కేంద్రం..
మాక్సివిజన్ ఫౌండర్, కో చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “సోమాజిగూడ ఎల్లప్పుడూ ఆవిష్కరణల పరంగా కేంద్రంగా ఉంది. అధునాతన ఇమేజింగ్‌ను తీసుకురావడం కచ్చితత్వంతో కూడిన , సాంకేతికత ఆధారిత కంటి సంరక్షణను అందించే మా సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.






