ముందస్తు అనుమతి తప్పనిసరి… ఉత్తర్వులను

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‍రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. దేశంలో వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలతో ప్రధాని విస్తృత చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. కొవిడ్ చికిత్స కోసం ఆంధప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపడం సంప్రదాయం కాదని అన్నారు. హైకోర్టు జారీ చేసిన మద్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆపడం సరికాదని అన్నారు. హైదరాబాద్ వచ్చేందుకు అంబులెన్స్ లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని అన్నారు. భారత్ బయోటెక్ ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. డిసెంబర్ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసులు ఉత్పత్తి జరుగుతుందని అన్నారు.