Global Summit: గ్లోబల్ సమిట్ తొలి రోజు.. రూ.3,97,500 కోట్ల ఒప్పందాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ (Global Summit) లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సమిట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridharbabu) సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ కోసం తాము సాంకేతికత, సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని తెలిపారు. దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులు ఉద్యోగాల సాధనలో, ప్రపంచస్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
– NS GOUD






