Ibomma Ravi: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి చుక్కెదురు
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు (Nampally Court)లో చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐదు కేసుల్లో బెయిల్ (Bail) ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు. కేసు ప్రభుత్వం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు (Police) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరతస్వం ఉందని, బెయిల్ ఇస్దే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.






