Gutta: రాష్ట్రంలో కొత్త పార్టీలకు చోటు లేదు: గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలే చాలని, కొత్తగా పార్టీలు పెట్టేందుకు స్పేస్ లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) అభిప్రాయపడ్డారు. మండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు, అవకాశాలు వారివేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా పార్టీ పెట్టి, సమర్థంగా నడపడం, అంత తేలిక కాదు. ఇక్కడ ఎన్నో పార్టీలు పుట్టి, కనుమరుగయ్యాయి. కొత్త పార్టీ మనుగడ సాధించాలంటే దానికి సమయం కూడా అనుకూలించాలి. గతంలో చిరంజీవి(Chiranjeevi), దేవేందర్‌గౌడ్ (Devender Goud) పార్టీలు పెట్టి ఏం చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చుకు వెనకాడకుండా, సమస్యలను అధిగమిస్తూ, వ్యయప్రయాసలతో పార్టీలను నడపాల్సి ఉంటుంది అని వివరించారు.






