IPS: భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట (Siddipet) కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలోని కమిషనరేట్లకు చెందినవే కావడం గమనార్హం. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా, రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరిగా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను పనర్వ్యవస్థీకరించారు. ఫ్యూచర్ సిటీ (Future City) కమిషనరేట్లో కొత్త ప్రాంతాలను కలిపారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేర్లు, సరిహద్దులను మార్చారు. కొన్ని జోన్ల పేర్లు యథాతథంగానే ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారాయి. ఇటువంటి మార్పులకు కూడా బదిలీల్లో చూపారు. హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రేంజ్లుగా విభజించి, ఇద్దరు అధికారులను నియమించారు.






