Bandi Sanjay: ఆ చట్టంలో పాలమూరు-రంగారెడ్డికి పేరే లేదు : బండి సంజయ్
కృష్ణా జలాల అంశంలో ప్రజలకు కేసీఆర్ (KCR) పదేపదే మోసం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ (Telangana)కు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే, 299 టీఎంసీలకే ఆయన ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించినప్పుడు ఎవరూ స్పందించలేదన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలు నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకోలేదు. అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదు. అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి అభ్యంతరం చెప్పొద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. ఆ చట్టంలో పాలమూరు-రంగారెడ్డికి పేరే లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని ఏపీకి తరలించారు. దీన్ని గతంలో అడ్డుకోలేదు. కాంగ్రెస్, కేసీఆర్ చేసిన మోసాలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అని అన్నారు.






