Indigo: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో (Indigo) విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. మంగళవారం శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 14, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ (Visakhapatnam) నుంచి బెంగళూరు,హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్‌జెట్ (SpiceJet) విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబయి, ఢల్లీి, పుణె, హావ్‌డా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
– NS GOUD






