Minister Vakiti: మేమంతా మీపైనే ఆశలు పెట్టుకున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి
క్రీడాకారులూ మేమంతా మీపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆటనే దైవంగా భావించి ఆడండి. ప్రపంచం మీ వైపు చూస్తోంది అని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటీ శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్యానెల్ డిస్కషన్లో వాకిటి శ్రీహరి, మంత్రి అజారుద్దీన్‌లతో (Azharuddin) పాటు, క్రీడాకారులు పీవీ సింధు (PV Sindhu), గుత్తా జ్వాల, గోపీచంద్ (Gopichand), అంబటి రాయుడు, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు. మౌలిక వసతులు, కోచ్‌లు చాలా కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. గోపిచంద్ అకాడమీ నుంచి అనేకమంది వచ్చారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం. పుట్‌బాల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మంచి పేరు తెచ్చుకున్నారు. క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలి. గతంలో కోచ్‌ల కొరత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించాం అని పేర్కొన్నారు.
– NS GOUD






