తెలంగాణకు కొత్త పోలీస్ బాస్… నూతన డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (C.V. Anand) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటం తో, ప్రభుత్వం ఆ స్థానంలో సీవీ ఆనంద్‌ను ఎంపిక చేసింది.డీజీపీ రేసులో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే (Vinayak Prabhakar Apte), సౌమ్య మిశ్రా (Soumya Mishra)ల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించింది. అయితే, వీరిలో అందరికంటే సీనియర్ కావడంతో పాటు, గతంలో ఆయన నిర్వహించిన కీలక బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ సీనియర్ కావడంతోనే డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ స్థానంలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శిఖాగోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్ డీజీపీగా నియమితులవడంపై అప్పుడే స్పష్టత వచ్చినట్లయింది.
ఇవి కూడా చదవండి






