Telangana Thalli: ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది : రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో (Collectorates) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమిట్ (Global Summit) ప్రాంగణం నుంచి సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. 2009లో ఇదే రోజు ( డిసెంబర్ 9) తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొందలు పెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించాం. స్వరాష్ట్ర కల నిజమై సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్‌గా రూపొందుతోంది. సోనియా గాంధీ (Sonia Gandhi) ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకులు సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9న కావడం మా అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినం. ఏటా తెలంగాణ తల్లి అవతరన దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారు. మా పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోంది అని అన్నారు.
– NS GOUD






