Electric Car : ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒలెక్ట్రా కంపెనీ రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ కారు (Electric Car) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ఫ్యూచర్‌సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ అనంతరం రేవంత్ రెడ్డి స్టీరింగ్ అందుకుని కారును నడిపించారు. కారులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ కృష్ణారెడ్డి (Krishna Reddy) కూర్చున్నారు.
– NS GOUD






