Revanth Reddy :జపాన్‌లో భారత రాయబారితో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ చేరుకుంది. జపాన్‌లో భారత రాయబారి శిబు జార్జ్ (Shibu George)తో భేటీ అయింది. టోక్యో లోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌజ్ (India House)లో ఈ సమావేశం జరిగింది. శిబు జార్జ్ వారికి విందు ఇచ్చారు. పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ఎంపీ కె.రఘువీర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి (NVS Reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi), మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నారు.