బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు బెయిల్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రూ.25 వేలతో కూడిన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మన్నె క్రిశాంక్‌ను మే 1వ తేదీన మధ్యాహ్నం చౌటుప్పల్ దగ్గర అరెస్టు చేశారు.