Congress: ఏకగ్రీవాల్లో 90 శాతం విజేతలు కాంగ్రెస్ వారే
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 15 శాతం ఏకగ్రీవాలయ్యాయని పీసీసీ అద్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అందులో 90 శాతం మంది విజేతలు కాంగ్రెస్ (Congress) బలపర్చిన వారే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనతో గాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యం వస్తోందని, సొంతూరికి సేవ చేయాలన్న మమకారంతో విద్యావంతులైన యువత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వివరించారు. తన సొంతూరు రాహత్‌నగర్ ఓపెన్ కేటగిరీ అయినా ఎస్టీ అభ్యర్థి తిరుపతి (Tirupati) ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సచివాలయంలో, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు (Telangana Thalli statues) ఏర్పాటు చేయిస్తుంటే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. హరీశ్‌రావు ఎన్ని మాట్లాడినా వారి పదేళ్ల నిర్వాహకాన్ని ప్రజలు మాత్రం మర్చిపోరని దుయ్యబట్టారు.
– NS GOUD






