విశాఖ పోర్టు మరో అరుదైన ఘనత
విశాఖపట్నం పోర్టు అధారిటీ మరో అరుదైన ఘనత ను సాధించింది. ఒక షిప్పు ద్వారా ఒక్క రోజులో అత్యధిక కంటైనర్లను హ్యాండిల్ చేసిన రికార్డును పోర్టు మరో మారు అధిగమించిందని విశాఖ పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో విశాఖపట్నం పోర్టు పరిధిలోని కంటైనర్ టెర్మినల్ లో ఒక నౌక నుంచి 3921 టిఈయూల కంటైనర్లను హ్యాండిల్ చేసిన ఒకే నౌక నుంచి అత్యధిక కంటైనర్లను హ్యాండిల్ చేసిన ఘనత సొంతం చేసుకుందని, ఎంవిఎంఎస్సి అల్డి 111 నౌక ద్వారా పోర్టు ఈ కంటైనర్లను హ్యాండల్ చేసిందన్నారు. తాజాగా ఈ నెల 8న 4035 టియీయూల కంటైనర్లను హ్యాండిల్ చేసి పాత రికార్డులను తిరగరాసిందన్నారు. ఎంఎస్సిగైడ్ 111 అనే నౌక ద్వారా ఈ కంటైనర్లను హ్యాండిల్ చేసిందని, ఈ ఘనతను సాధించిన టెర్మినల్ ఆపరేటర్ సిబ్బందిని పోర్టు చైర్పర్సన్ డా.ఎం. అంగముత్తు అభినందించారు.






