Vijay Rashmika: విజయ్ రష్మికల లవ్ జర్నీ
టాలీవుడ్లో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో మొదలైన పరిచయం ఆఫ్‌స్క్రీన్ ప్రేమగా మారి పెళ్లి వరకు చేరిన జంటగా విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(rashmika mandanna) నిలిచారు. వీరి పరిచయం గీత గోవిందం(geetha govindam) మూవీ టైమ్ లో మొదలైంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్(Dear comrade) టైమ్ లో ఆ స్నేహం ప్రేమగా మారిందనే టాక్ అప్పట్లోనే వినిపించింది. సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా, ఆ మూవీ తమకు ఎంతో స్పెషల్ అని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నారనే వార్తలు వచ్చినా, ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.
మొదట్లో మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చిన ఈ జంట, ఫిబ్రవరి 22న పెళ్లితో తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. పలు షోలలో రష్మికను “ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?” అని అడిగితే, ఆమె తరచూ విజయ్ దేవరకొండ పేరే చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. గతేడాది సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ జంట. ఎంగేజ్మెంట్ తర్వాత రిలీజైన ది గర్ల్ ఫ్రెండ్(the girlfriend) మూవీ విజయం అందుకోగా, ఆ సక్సెస్ మీట్లో గెస్ట్‌గా వచ్చిన విజయ్, అందరి ముందూ ఆమె చేతిని ముద్దాడడం చర్చనీయాంశమైంది. అదే వేదికపై ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక విజయ్ దేవరకొండ ఉండాలంటూ రష్మిక చెప్పిన మాటలు వారి బాండింగ్‌ను స్పష్టంగా తెలియజేశాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విజయ్‌తో మాత్రమే కాకుండా, అతని తమ్ముడు ఆనంద్(anand), తల్లి మాధవి(madhavi)తోనూ రష్మికకు మంచి అనుబంధం ఉంది. ఆనంద్ సినిమాల ఈవెంట్లకు గెస్ట్‌గా హాజరై ఎంకరేజ్ చేయడం ఆమె కుటుంబంతో కలిసిపోయిందనే దానికి గొప్ప నిదర్శనం. ఇకమాధవిని తన తల్లి తర్వాత తల్లిగా భావిస్తానని చెప్పిన రష్మిక, ఇప్పుడు అధికారికంగా దేవరకొండ కుటుంబంలో అడుగుపెట్టబోతోంది. మరికొన్ని గంటల్లో రష్మిక దేవరకొండ ఇంటి కోడలిగా మారబోతుండగా, ఈ ప్రేమకథ టాలీవుడ్లో మరో హ్యాపీ కపుల్ స్టోరీ గా నిలవనుంది.
ఇవి కూడా చదవండి

















