ఆ సమస్యలను పరిష్కరించండి .. కేంద్ర మంత్రిని కోరిన పెమ్మసాని
గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిలోని కాజా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రోడ్డు, రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో పలు సమస్యల గురించి వివరించారు. చిన్నకాకాని జంక్షన్ వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల అంశాన్ని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ (Vijayawada) వెస్ట్ బైపాస్ ఎన్ హెచ్-16తో కలిసే చిన్నకాకాని జంక్షన్ వద్ద ప్రస్తుతం గ్రేడ్ సపరేటెడ్ ఇంటర్ఛేంజ్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. గ్రేడ్ సపరేటెడ్ ఇంటర్ఛేంజ్ లేదా యూ డైరెక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల గుంటూరు (Guntur), విజయవాడ రాకపోకలు సులభతరం అవుతాయని, పరిశ్రమలు, ఐటీ, విద్యాసంస్థలు, వైద్య రంగాలకు మెరుగైన కనెక్టివిట్ లభిస్తుందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలక మౌలిక వసతి ప్రాజెక్టు అవుతుందని వివరించారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంబంధితీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారని పెమ్మసాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి






