Tirumala: నేడు శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని(Srivari Temple) మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు చంద్రగ్రహణం ముగియనుండగా ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు (Temple doors) మూసివేయడం ఆనవాయితీ. రాత్రి 7:30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించిన తరువాత, రాత్రి 8:30 గంటలకు దర్శనాలు (Visions) పునప్రారంభం కానున్నాయి. గ్రహణం నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరా సేవలను టీటీడీ (TTD) రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















