Nagababu : మరో 20 ఏళ్లు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు : నాగబాబు

మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) అన్నారు. సీతంపేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన (Janasena) కార్యకర్తలు వైసీపీ (YCP) అరాచకాలపై పోరాటం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో సమర్థంగా పరిపాలిస్తోందని చెప్పారు. చిన్నచిన్న లోపాలు ఏంటే వాటిని సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. నేను ఉత్తరాంధ్ర (Uttarandhra) లోనే ఉంటాను. నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తాను. దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదువులు వస్తాయి. మరి కొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్చాలి అని తెలిపారు.