Minister Gottipati: ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్లే : మంత్రి గొట్టిపాటి

సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం (Anantapur) సభతో వైసీపీ దుకాణం మూతపడినట్లే అని తెలిపారు. ప్రజల స్పందన చూసి జగన్‌కు అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్ నిరూపించారు. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్లే. యూరియా కొరతపై రైతు పోరు అంటూ వైసీపీ(YCP) హడావిడి చేసింది. ఆ పార్టీ ఐదేళ్ల పాలనలో ఒక్క పనీ చేయలేదు. ఎవరైనా చేసినా ఓర్వలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేయాలన్నదే జగన్ లక్ష్యం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్నదే చంద్రబాబు (Chandrababu) ధ్వేయం. ఇద్దరి నాయకుల మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు.