Hartford : హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్ సెంటర్

అమెరికా కేంద్రంగా ఉన్న బీమా కంపెనీ హార్ట్‌ఫోర్డ్ (Hartford )హైదరాబాద్‌లో తన టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తమ సాంకేతిక రూపాంతర ప్రయాణంలో ఈ కేంద్రం ఏర్పాటు ఒక మైలురాయి అని తెలిపింది. హార్ట్‌ఫోర్డ్ కంపెనీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల అభివృద్ధికి హైదరాబాద్ (Hyderabad) సెంటర్ ప్రధాన కేం ద్రంగా పని చేయనుంది. హార్ట్‌ఫోర్డ్‌కు అమెరికా (America)లో ఇప్పటికే ఆరు టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. తమ ఉత్పత్తులు, ప్రాసె్‌సల్లో ఏఐ వినియోగం పునాదిలా మారనుందని కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ (Shekhar) తెలిపారు.