Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్

తన తల్లిని చూసి తండ్రి తడబడ్డాడని చెప్తోంది మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కూతురు కొణిదెల సుస్మిత(Konidela Susmitha). బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కిష్కింధపురి(Kirshkindhapuri) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుస్మిత ఓ గెస్టుగా హాజరయ్యారు. తనకు హార్రర్ జానర్ అంటే చాలా ఇష్టమని చెప్పిన సుస్మిత(susmitha), కిష్కింధపురి ట్రైలర్ చాలా బావుందని, సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.
ఈవెంట్ లో సుస్మిత నుంచి మరింత ఇన్ఫర్మేషన్ లాగాలని ప్రయత్నించారు యాంకర్ సుమ. చిరంజీవి గారికి మీ అమ్మ గారంటే ఏమైనా భయముందా అని అడగ్గా, ఈ రోజే ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. మన శంకరవరప్రసాద్ గారు(mana shankara varaprasad Garu) మూవీ కోసం ప్రస్తుతం పాటను షూట్ చేస్తున్నామని సుస్మిత చెప్పారు.
రీసెంట్ గా సినిమా సెట్స్ కు అమ్మ వచ్చిందని, అప్పటివరకు బానే డ్యాన్సులు చేస్తున్న నాన్న, అమ్మ వచ్చి కూర్చునేసరికి స్టెప్స్ మర్చిపోవడం, డ్యాన్సుల్లో తడబడ్డారని, అమ్మ ముందు ఉండటం వల్లే అవన్నీ జరిగాయని అసలు విషయాన్ని బయటపెట్టారు. సుస్మిత ఈ విషయాన్ని వెల్లడించాక ఎంతటి మెగాస్టార్ అయినా భార్య ముందు తడబడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.