Dallas Dasara: డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్స్

డల్లాస్ తెలుగు అలయ్ బలయ్ సంగం (Dallas Telugu Alai Balai Sangham) ఆధ్వర్యంలో డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్సయింది. అక్టోబరు 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి 11 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. దుర్గాపూజ, రామ్ లీల, రావణ్ దహనం, ఫైర్ వర్క్స్, లైఫ్ ఫెర్ఫామెన్స్, డీజే, కల్చర్ ప్రోగ్రామ్స్, కోలాటం మరియు దాండియా, వెరైటీ ఫుడ్స్, స్టాల్స్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కనీసం 10 వేల మంది ఈ వేడుకలకు (Dallas Dasara) హాజరవుతారని అంచనా. ‘మన అమెరికా తెలుగు సంఘం’ (మాటా) మద్దతుతో ఈ కార్యక్రమం జరుగుతోంది.