Canada: ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ సీఈవో ప్రేమ్ వాత్సా తో మంత్రి లోకేష్ భేటీ
నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుచేయండి
టొరంటో (కెనడా): ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సా తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తిచేసేందుకు సహకారం అందించండి. ఆంధ్రప్రదేశ్ లోని టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా రాష్ట్రంలోని హోటల్, పర్యాటక రంగాల అభివృద్ధికి చేయూతనివ్వండి. ఫ్లోరిడాలోని పనామా సిటీ తరహాలో రాష్ట్రంలోని నల్లమలలో స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఫెయిర్ ఫాక్స్ సీఈవో ప్రేమ్ వాత్సా మాట్లాడుతూ… టొరంటో కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ… నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి, సన్మార్ కెమికల్స్ లో తమ సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రేమ్ వాట్సా చెప్పారు. (ఫెయిర్ ఫాక్స్ సంస్థ $30 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది.)






