Aruri Ramesh: బీజేపీకి షాక్ .. బీఆర్ఎస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్!
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (Aruri Ramesh) బీజేపీ (Aruri Ramesh BJP)కి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పంపించారు. ఆరూరి రమేశ్ వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018లో రెండు పర్యాయాలు విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసిన ఆరూరి, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.2024 మార్చి 17న అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సమక్షంలో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేసి కడియం కావ్య చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ రానున్న క్రమంలో బీజేపీ నుంచి బయటకు రావాలని ఆయన అనుచరులు ఆరూరి రమేశ్‌పై ఒత్తిడి తీసుకవచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన రాజీనామా లేఖను పంపించారు. ఈనెల 28న కేసీఆర్ (KCR) సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకొనేందుకు ఆరూరి రమేశ్ సిద్ధమయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






