Kavitha: కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సొంత పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీ (Delhi)కి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం 3నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీ (Political party)గా గుర్తింపు దక్కే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అనుకున్నట్లుగా మూడు నెలల్లో గుర్తింపు దక్కితే, జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి కూడా నిలిచే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సభ్యులు జాగృతిలో చేరాలని కవిత ఇటీవలే పిలుపునిచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






