Lokesh: ఎయిర్ బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో మంత్రి లోకేష్ భేటీ

సింగపూర్ (Singapore) పర్యటనలో భాగంగా ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో ఆంధ్రప్రదేశ్ నారా లోకేశ్ (Nara Lokesh) కీలక సమావేశం నిర్వహించారు. ఎయిర్‌బస్‌కు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సింగిల్-కంట్రీ మార్కెట్. ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలో ఎయిర్‌బస్‌కు డెడికేటెడ్ MRO(మెయింటెనెన్స్, రిపైర్, ఓవర్ హాల్) హబ్‌గా మారే అవకాశముంది. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పని చేయాల్సిందిగా కోరాను. సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించాను. రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు ఏపీని సందర్శించాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది.