Modi: ప్రధాని మోదీ సభ.. ఆహార ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ప్రధాని మోదీ (Modi) సభ సందర్భంగా కర్నూలు (Kurnool) కు భారీగా ప్రజలు తరలివచ్చారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి బయల్దేరారు. సభకు వచ్చే ప్రజల కోసం ఆహార ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఆహార పొట్టాలను సిద్ధం చేశారు. నంద్యాల కర్నూలు రోడ్డులో ఆహార ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) పరిశీలించారు. ఫుడ్‌స్టాల్ (Food stall) లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యతను ఆయన పరిశీలించారు. సభకు వచ్చే సామాన్య ప్రజలు కూటమి నేతలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.